Chandrababu: ఎన్డీఏ కూటమి గెలుపు రాష్ట్రానికి సంజీవనిగా మారింది..! 1 y ago
AP : గత ప్రభుత్వం కేవలం రూ. 3 వేలు పింఛను మాత్రమే ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 4 వేలు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పారు. గడిచిన ఐదేళ్లు ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని చెప్పారు.
ఎన్డీఏ కూటమిని గెలిపించి ప్రజలు మంచి పని చేశారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి సంజీవనిగా మారిందన్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇప్పుడు అప్పు అడిగినా ఎవరూ ఇవ్వడం లేదని చెప్పారు. తాము ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు.
అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందన్నారు. ఐదేళ్లు వైసీపీ నేతలు దోచుకున్నారన్నారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంందన్నారు. వైసీపీ హయాంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెస్ తీసుకొచ్చామన్నారు.